కావలసిన పదార్థాలు:-

1.పెరుగు – 1 కప్

2.షుగర్ -4 టేబుల్ స్పూన్

3.యాలకులు -2 

4.రోజ్ వాటర్ – 1 టీ స్పూన్

5.చల్లటి నీళ్లు -2 గ్లాసులు

6.పుదీనా ఆకులు – 4

తయారు చేయు విధానం:

  1. ముందుగా ఒక బౌల్ లో పెరుగు తీసుకోవాలి.అందులో చక్కెర,రోజ్ వాటర్ వేసి బాగా కలిపి నీళ్లు పోసుకుని మజ్జిగ కవ్వం సహాయంతో బాగా కలుపుకోవాలి.
  2. యాలకులని పొడి కొట్టి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇపుడు రెండు గ్లాసులు తీసుకుని అందులో పోసుకుని పైన యలకుల పొడి, పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చల్లచల్లని లస్సీ రెడీ అవుతోంది.
  4. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు.
  5. కొంతమంది ఇందులో పాల మీగడ కూడా వేస్తారు.
  6. ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు.
  7. తప్పకుండా ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది

ఆరోగ్య ప్రయోజనాలు

1. వ్యాధి నిరోధక శక్తి ని పెంచడానికి సహాయ పడుతుంది

2.శరీరంలో వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ చేస్తుంది

3.బరువు తక్కువగా ఉన్నవారికి బరువు పెరగడంలో సహాయ పడుతుంది.

4.ఇందులో కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది

5.జీర్ణ క్రియకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.

6.బాడీ హీట్ ను తగ్గిస్తుంది

7.ఆకలిని కంట్రోల్ చేస్తుంది.

8.చెడు బాక్టీరియా ని బయటకు పంపుతుంది.

Best To Have With Lassi

-50%
Original price was: ₹2.00.Current price is: ₹1.00.
-50%
-50%

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.