మ్యాంగో చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు:-

  1. బొన్లెస్ చికెన్ – 1 కిలో
  2. నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
  3. పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
  4. మామిడికాయ – 1
  5. వెల్లుల్లి రెబ్బలు – 6
  6. పచ్చిమిర్చి -4
  7. ఉల్లిపాయలు -3
  8. పసుపు – టీ స్పూన్
  9. కారం – 2 టీ స్పూన్
  10. జీలకర్ర పొడి -అర టీ స్పూన్
  11. ధనియాల పొడి – 1 టీ స్పూన్
  12. పంచదార – అర టీ స్పూన్
  13. నూనె – 4 టేబుల్ స్పూన్లు
  14. ఉప్పు – రుచికి సరిపడ
  15. కొత్తిమీర – తగినంత

తయారీ విధానం:-

  1. ముందుగా మామిడికాయను చెక్కు తీసి ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు కూడా వేసుకోవచ్చు
  2. ఇపుడు చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి నిమ్మరసం, పెరుగు కలిపి పట్టించి అరగంట సేపు నానబెట్టాలి
  3. తరువాత ఉల్లిపాయలను కూడా మిక్సీలో వేసి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి
  4. ఇపుడు ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో నానబెట్టిన చికెన్ ముక్కల్ని వేసి మీడియం మంట మీద అవి పూర్తిగా వేగెంతవరకు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. ఇపుడు ఇంకో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  6. తరువాత ముందుగానే చేసిపెట్టుకున్న మామిడికాయ ముద్ద, పసుపు, కారం,ధనియాల పొడి,జీలకర్ర పొడి,పంచదార వేసి కలిపి 5 నుండి 6 నిమిషాల పాటు వేయించాలి
  7. తరువాత అందులో వేయించిన చికెన్ ముక్కలు,రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి మసాల అంతా ముక్కలకి పట్టేలాగా 5 నిమిషాలు ఉడికించాలి
  8. ఇపుడు ఎంత కాన్సిస్టన్సీ కావాలో అన్ని నీళ్లు పోసుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి
  9. తరువాత కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి
  10. అంతే ఎంతో రుచికరమైన మ్యాంగో చికెన్ రెడీ
  11. తప్పకుండా ప్రయత్నిచండి . చాలా బాగుంటుంది

మసాలా దినుసులు లవంగాలు,చెక్క,యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఇంట్లో ఉండే అన్ని పదార్థాలతో తయారు చేసుకోవచ్చు.ఎలా చేసుకున్న చాలా బాగుంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు(మామిడి మరియు చికెన్) :-

  1. మ్యాంగోలో తక్కువ క్యాలోరీస్ ఉన్నాయి కాబట్టి బరువు తగ్గడం లో ఇది సహాయ పడుతుంది
  2. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ ఎ అండ్ సి, B6, ఐరన్, కాల్షియమ్, జింక్, పొటాషియం అన్ని ఉంటాయి.
  3. ఇందులో ఆంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు ,మినరల్స్ అందుతాయి
  4. ఇది కాన్సర్ రాకుండా ఉండేందుకు కొంతవరకు సహాయపడుతుంది.
  5. దీనిని తినడం వలన జీర్ణక్రియ బాగా వృద్ధిచెందుతుంది
  6. బ్రెయిన్ ఫంక్షన్ ని సక్రమంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది
  7. పచ్చి మామిడికాయ పండిన మామిడి పండు కంటే చాలా శ్రేష్ఠమైనది
  8. బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది
  9. ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది
  10. ఎనిమియా ని అరికట్టడంలో ఉపయోగపడుతుంది

అధిక ప్రోటీనులు మరియు మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండటం వల్ల కండరాలు మరియు ఎముకలు దృఢంగా ఉంటాయి.  ఇంకాబరువుని సమపాళ్లలో ఉంచడానికి చికెన్ ఎంతగానో దోహదపడుతుంది.

 కోడి కూర తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  ఇది అలవాటు లేని వారికి కూడా తినిపించడం మంచిది..

 

Best To Have With Mango Chicken Curry

-50%
Original price was: ₹2.00.Current price is: ₹1.00.
-50%
-50%

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.