మలై మటర్  పన్నీరు  తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :-

  1. పనీర్ – 250 గ్రాములు ( కావలసిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి )
  2. పచ్చి బఠాణీ లు – రెండు కప్పులు
  3. పెరుగు – అర కప్పు
  4. మీగడ – పావు కప్పు
  5. ఉల్లిపాయ –   ½ కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్నవి
  6. ధనియాల పొడి – 1 టీస్పూన్
  7. వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  8. ఉప్పు – రుచికి సరిపడ
  9. కారం – తగినంత
  10. కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్ ( చిన్నగా తరిగి పెట్టుకోవాలి)
  11. జీడిపప్పు పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  12. గసగసాల పేస్ట్ – ½ టేబుల్ స్పూన్
  13. ఆయిల్ – తగినంత
  14. పంచదార – అర  టీస్పూన్

 

తయారీ విధానం:-

  1. ఒక కడాయి లో ఆయిల్ వేసి వేడి అయ్యాక వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి
  2. తరువాత ఉల్లిపాయ ముక్కలను యాడ్  చేయాలి
  3. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంతవరకు వేగించాలి
  4. తరువాత గసగసాల పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం,పంచదార వేసి  కలిపి 5 నుండి 6 నిమిషాలు ఉడికించాలి
  5. తరువాత పచ్చి బఠాణీలు,పెరుగు,మీగడ యాడ్ చేసి బాగా కలిపి మరో 5 నుండి పది నిమిషాలు ఉడికించాలి
  6. బఠాణీలు సాఫ్ట్ అయ్యాక కట్ చేసిన పనీర్ ముక్కల్ని యాడ్ చేసి బాగా కలపాలి
  7. ఇపుడు మూత పెట్టి ఆ మసాల మిశ్రమం పనీర్ కి పట్టేంత వరకు ఉడికించాలి
  8. తరువాత ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడ నీళ్లు పోసుకుని మరో 5 నిమిషాలు ఉడికించాలి
  9. తరువాత జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి మరో అయిదు నిమిషాలు ఉడికించాలి
  10. 5 నిమిషాలు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలై మటర్ పనీర్ రెడీ

ఇందులో కారం బదులు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. ఎలా చేసినా రుచి అదిరిపోతుంది. ఇందులో పంచదార యాడ్ చేయడం వలన కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి.

 

ఆరోగ్య ప్రయోజనాలు:-

  1. పచ్చి బఠాణీలు బరువును తగ్గించడంలో సహాయ పడతాయి
  2. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది 
  3. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది
  4. ఇమ్మ్యూనిటి పెంచడానికి సహాయ పడుతుంది
  5. జీర్ణక్రియ ను పెంచడంలో ఉపయోగపడుతుంది

Best To Have With Malai Matar Paneer

-47%
Price range: ₹236.00 through ₹755.20 Inc GST
-50%
Price range: ₹336.00 through ₹672.00 Inc GST
-50%
Price range: ₹336.00 through ₹672.00 Inc GST
-56%
Price range: ₹470.40 through ₹940.80 Inc GST
-66%
Price range: ₹190.05 through ₹357.00 Inc GST
-37%
Price range: ₹551.25 through ₹998.55 Inc GST
-37%
Price range: ₹551.25 through ₹998.55 Inc GST
-37%
Price range: ₹551.25 through ₹998.55 Inc GST

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.