కూరగాయలు మరియు ఇతర పదార్థాలు:-

  1. ఉల్లిపాయ,టమాటో – ½ ఒక్కొక్కటి కట్ చేసుకుని పెట్టుకోవాలి చిన్నగా
  2. మునకాయ- 10 పీసులు
  3. వంకాయ -7 ముక్కలు
  4. క్యారెట్ -సగం కప్పు
  5. బంగాళదుంప -సగం కప్పు
  6. చింతపండు -నిమ్మకాయ సైజ్ అంత
  7. బెల్లం -1 టీ స్పూన్
  8. పచ్చిమిర్చి -2
  9. పసుపు -½ టీ స్పూన్
  10. ఉప్పు -సరిపడ
  11. సాంబార్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
  12. కరివేపాకు -10 
  13. ఆవాలు – 1 టీ స్పూన్
  14. మినప్పప్పు -¾ టీ స్పూన్
  15. ఆయిల్ – పోపు కి సరిపడ
  16. ఇంగువ -చిటికెడు

 

తయారుచేసే విధానం:-

  1. ఒక బౌల్ లో చింతపండు ని నీళ్లు వేసి నానబెట్టాలి
  2.  ప్రెషర్ కుక్కర్ లో కందిపప్పు దానికి తగినన్ని నీళ్లు, కొంచెం పసుపు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి
  3. తరువాత అన్ని కురాగాయలని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి
  4. ఒక పెద్ద కడాయి లో నానబెట్టిన చింతపండు ని రసం పిండి కొన్ని నీళ్లు యాడ్ చేసి అందులో పోయాలి.
  5. ఇపుడు ఆ రసంలో పసుపు,ఉప్పు, పచ్చిమిర్చి,బెల్లం వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి
  6. ఇపుడు 5 విజిల్స్ వచ్చాక పప్పు ని మెత్తగా మెదిపి పెట్టుకోవాలి
  7. తరువాత ఆ చింతపండు రసంలో తరిగిన కురాగాయలని వేసి బాగా కలిపి కూరగాయలు ఉడికే వరకు ఉడికించాలి
  8. తరువాత మెదిపిన పప్పు ని వేసి ఇంకో పొంగు వచ్చే వరుకు ఉడికించాలి
  9. ఇపుడు సాంబార్ పౌడర్ ని వేసి కలపాలి
  10. ఇపుడు పోపు వేసే పాత్రలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు,కరివేపాకు, మినప్పప్పు, ఇంగువ,రెడ్ చిల్లి వేసి సిమ్ లో బాగా వేగించాలి
  11. ఇపుడు ఈ పోపు మిశ్రమాన్ని వుడుకుతున్న సాంబార్ లో పోసి బాగా కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి
  12. అంతే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి

ఆరోగ్యకరమైన ప్రయోజనాలు:-

  1. సాంబార్ లో వాడే కందిపప్పు లో ప్రోటీన్లు ఉంటాయి అంతేకాకుండా ఇందులో వాడే కూరగాయల లో ఆంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. దీనిని తీసుకోవడం వలన అజీర్తి నుండి విముక్తి లభిస్తుంది
  2. దీనిని తీసుకోవడం వలన శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు

 

Best To Have With South Indian Sambar

-50%
Original price was: ₹2.00.Current price is: ₹1.00.
-50%
-50%

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.