తయారు చేయుటకు కావలసిన పదార్థాలు:

  • సొరకాయ- ఒకటి ½ kg
  • పాలు-½ లీటర్
  • నెయ్యి-100g
  • ఇలాచి పౌడర్-½ స్పూన్
  • షుగర్-½ kg
  • కాజు-50G
  • బాదం-50g
  • ఎండు ద్రాక్ష-50g

తయారీ విధానం

  • ముందుగా సొరకాయను కడిగి పైన పీల్ తీసుకొని లోపల ఉన్న వైట్  తీసి చిన్నగా తురుముకొవాలి.
  • అలానే పాలను కూడా వేడి చేసుకొని చల్లర్చుకోవాలి.లేదంటే పచ్చిపాలు వేస్తే విరిగిపోయేఅవకాశం ఉంటుంది.
  • ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి  అయ్యాక కాజు,బాదం,ఎండు ద్రాక్ష సెపరేట్ సెపరెట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే నెయ్యి లోకి తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఈ హల్వ చేస్తూ ఉన్నంతసేపు మంట చిన్నగా పెట్టుకోవాలి.అలానే మూత కూడా పెట్టుకోవాలి. 
  • సొరకాయ తురుము సగం ఫ్రై అయ్యాక అందులో కొన్ని పాలు పోసుకొవాలి.ఈ పాలలో మిగిలిపోయిన సగం సొరకాయ తురుము ఉడికించుకొవాలి.
  • పోసుకున్న పాలు అన్ని ఇంకి పోయే వరకు ఉడికించాలి.
  • పాలు అన్ని ఇంకిపోయాకా అందులో షుగర్ వేసుకొని కరిగే వరకు ఉడికించుకొవాలి.
  • షుగర్ అంతా కరిగిన తరువాత వేయించి పక్కన పెట్టుకున్న కాజు,బాదం,ఎండు ద్రాక్ష  వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టి టేస్టి సొరకాయ హల్వ రెడీ.
  • అలానే పై నుంచి కొంచెం నెయ్యి వేసుకున్న బాగుంటుంది గార్నిష్గా.

ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.వీటిని ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు.సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన శరీరంలో ఉండె వ్యర్థాలను తొలగించడంలో సహయపడుతుంది.అలానే అరుగుదల కూడా బావుంటుంది.

Best To Have With Sorakaya Halwa

-50%
Original price was: ₹2.00.Current price is: ₹1.00.
-50%
-50%

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.