కావలసిన పదార్ధాలు

నలుగురు కోసం చేస్తున్న గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై కోసం

  • గోరుచిక్కుడుకాయలు-250 గ్రాములు
  • ఎండుకొబ్బరి-50 గ్రాములు తురిమి ఉంచుకోవాలి.
  • ఆనియన్-2 పెద్దవి
  • టొమాటో-2పెద్దవి
  • గ్రీన్ చిల్లిస్-8 ఒకవెల ఎక్కువ కారం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి.
  • సాల్ట్-రుచికి సరిపడా
  • కారం-తగినంత
  • పసుపు-చిటికెడు
  • ఆవాలు-1 స్పూన్
  • జీలకర్ర-1 స్పూన్
  • ఆయిల్-3 టేబుల్ స్పూన్లు 
  • కరివేపాకు-40 ఆకులు
  • ఎండుమిర్చి-2
  • ధనియాలపొడి -1స్పూన్
  • జీలకర్రపొడి -1 స్పూన్
  • మినప్పప్పు-½ స్పూన్
  • శెనగపప్పు-1/2స్పూన్
  • వాటర్ 1 గ్లాస్

తయారీవిధానం 

ముందుగా గోరుచిక్కుడుని కట్ చేసుకొని  ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ప్రెజర్ కుక్కర్లొ పెట్టుకుంటే ఒక విజిల్ సరిపోతుంది.ఇది ఫ్రై కాబట్టి ఉడికించుకున్నాక గోరుచిక్కుడులోనీ వాటెర్ అంతా స్క్వీజ్

చేసుకొని పెట్టుకోవాలి. అలానే అన్ని కూరగాయలను కట్ చేసుకొని  సన్నగా పక్కన పెట్టుకోండి.

  • ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. 
  • ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి అయ్యాక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి.
  • ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు,జీలకర్ర,మినపప్పు,శెనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • అవి ఫ్రై అయ్యాక అలానే కరివేపాకు,ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి అలానే సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.అంతా ఒకే సారి వేసినా పరవాలేదు. 
  • ఆనియన్ వేశాక సాల్ట్ వేసుకుంటే ఆనియన్లోనీ వాటర్ బయటికి వచ్చి ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. 
  • ఇప్పుడు అలానే తరిగిన పచ్చిమిర్చి టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. 
  • అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు,కారం వేసుకోవాలి.
  • కారం కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే గ్రీన్చిల్లి కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి.
  • ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి అలానే ధనియాల పొడి వేసి బాగా కలపాలి. 
  • అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడును వేసుకొని వేసిన మసాలాలు కలిసేలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని కడాయి మీద ప్లేట్ పెట్టుకొని ఒక 3 నిముషాలు అలానే ఉంచాలి.
  • ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము చల్లాలి. 
  • ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం సేపు అలానే ఉంచితే వేడి వేడి గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై తయారవుతుంది.

కొబ్బరిపొడి వేశాక స్టవ్ ఆన్లో పెట్టి ఫ్రై చేసుకొకూడడు. ఎందుకంటే కొబ్బరి మాడి వాసన కూడా మాడిన మాదిరి వస్తుంది.కాబట్టి కొబ్బరి తురుము వేసాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం సేపు అలానే ఉంచితే సరిపోతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

  • ఈ గోరుచిక్కుడును తీసుకోవడం వల్ల మన బాడీలోనీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడతాయి.
  • వీటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు తగ్గి కొలెస్టాల్ని అదుపులో ఉంచడానికి సహయపడుతుంది.
  • ఇవి గ్లుకోస్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి సహాయపడి డైయబెటిస్ని కంట్రోల్ చేస్తుంది.
  • వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన వ్యర్థాలను తొలగించడంలో  కూడా సహయపడుతుంది.

New Recipes

The best food lovers across globe speak about their favourite and delicious recipes here, you can consider exploring them and give a try and surprise your family.

Explore Recipes

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.