కావలసిన పదార్ధాలు

(ఇద్దరి కోసం చేస్తున్న రైస్ కి  ఈ పదార్థాలు)

  • బాస్మతి రైస్-1గ్లాస్ 
  • వాటర్-1 ½ glass
  • పుదీనా ఆకులు-20 ఆకులు
  • పచ్చిమిర్చి-5
  • కొత్తిమీర-1 కట్ట
  • ఆయిల్-3 టేబుల్ స్పూన్లు 
  • గరంమసాల-1 స్పూన్
  • కాజు-50గ్రాములు
  • ఆనియన్-2 కట్ చేసుకొని పెట్టుకోవాలి
  • బీన్స్- 10 కట్ చేసుకొనిపెట్టుకోవాలి
  • కాప్సికం-1 కట్ చేసుకొనిపెట్టుకోవాలి
  • క్యారెట్-2 కట్ చేసుకొని పెట్టుకోవాలి
  • ఉప్పు- రుచికి సరిపడా 
  • గ్రీన్ పీస్-50 g
  • అల్లం వెల్లులి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి-2 టేబుల్ స్పూన్
  • కరివేపాకు 30 ఆకులు
  • సోయాసాస్ 
  • రెడ్చిల్లిసాస్

తయారీ విధానం

 ముందుగా బాస్మతి బియ్యాన్నిఅరగంట ముందు నానబెట్టాలి.అలానే అరగంట తరువాత పొడిపొడిగా అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలానే పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్ను ఆయిల్లొ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ని చిన్నగా పొడుగ్గా కట్ చేసుకొని  పెట్టుకోవాలి .అలానే గోబిని చిన్ని ముక్కలు చేసుకుని వేడి నీళ్ళలో వేసుకొని 10 నిముషాలు ఉంచి పక్కన పెట్టుకోవాలి. అలా అయితే తొందరగా ఈరైస్ అవుతుంది.

  • ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని వేడి అయ్యాక కాజు ఇంకా కట్చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు,బీన్స్ ముక్కలు,గ్రీన్పీసు,ఆనియన్ ముక్కలు అన్ని వెజిటెబుల్స్ని వేసుకొని భాగ ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు మొత్తం మిశ్రమానికి సరిపడా ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి. 
  • ఇప్పుడు అలానే అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒకస్పూన్ సొయాసాస్,ఒకస్పూన్ రెడ్చిల్లిసాస్ అండ్ ఉడికించి పక్కన పెట్టుకున్న గోబిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు పుదీనా,కరివేపాకు,చిన్నగా కట్చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసిబాగా కలుపుకోవాలి. 
  • ఇలా ఒక 5 నిముషాలు చిన్నమంట మీద మూత పెట్టి ఉడికించాలి. 
  • 5 నిముషాలు తరువాత మూతతీసి సెర్వింగ్ బౌల్లో సెర్వ్ చేసుకుంటే వేడీ వేడీ టేస్టి గోబిఫ్రైడ్రైస్  రెడీ..

ఆరోగ్య ప్రయోజనాలు

  • క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలతొ పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. 
  • రోజు ఉదయం వేళ ఒక ½ కప్గోబిరసం తీసుకుంటే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. 
  • స్త్రీ పురుషలలో కూడా వచ్చే రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతూంది.
  • కిడ్నీ సంబధిత వ్యాధులకు కూడా ఈ క్యాలీఫ్లవర్  బాగా పనిచేస్తుంది.
  • ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి క్యాలొరీలు తక్కువగా ఉండటం వల్ల డైలీ డైట్లో తీసుకొని బరువు తగ్గడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. 
  • రక్తహీనత సమస్య ఉన్నప్పుడు కూడా క్యాలిఫ్లవర్ తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. 

Best To Have With Gobi Fried Rice

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.