కావలసిన పదార్ధాలు

(ఇద్దరి కోసం చేస్తున్నchicken 65 కిఈ పదార్థాలు)

  • కార్న్ ఫ్లోర్:½ టేబుల్ స్పూన్ 
  • బియ్యం పిండి: ½ టేబుల్ స్పూన్ 
  • గుడ్డు: 1
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • పచ్చిమిరపకాయలు: 3-4
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: డీప్ ఫ్రైకు సరిపడా
  • కారం: 2టేబుల్ స్పూను 
  • పెప్పర్ పౌడర్: 1టేబుల్ స్పూను 
  • జీలకర్ర పొడి: ½ స్పూన్
  • పసుపు: ఒక చిటికెడు
  • ఎముకలు లేని చికెన్: 300gms (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • నిమ్మరసం: 1tbsp
  • అల్లం:వెల్లుల్లి పేస్ట్: 1tsp

తయారీ విధానం

  • ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
  • తర్వాత ఒక గిన్నెలో నిమ్మరసం, ఉప్పు, వేసి మిక్స్చేసి చికెన్ కు పట్టించి కొంచెంసేపు మారినెట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.
  • ఈలోపు ఒకబౌల్లో కార్న్ ఫ్లో, పెప్పర్ పౌడర్, జీకలర్ర పొడి, పసుపు, ఉప్పు బియ్యం పిండి, గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా నిమ్మరసంలో మారినేట్ చేసిపెట్టుకొన్న చికెన్ను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో వేసి బాగామిక్స్ చేసి మరో గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఒక గంట తర్వాత, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక భాండిలొ నూనె వేసుకొని, కాగిన తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి ఒకనిముషం వేగించిన తరువాత  వాటిని ఒక చిన్న bowl లోకి

 తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు అదేనూనె పాన్లో ముందుగా ఒకగంటపాటు  మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి, 10 నుండి 15 నిముషాలు పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
  • ఎందుకంటే చికెన్ ముక్కలు బాగా ఫ్రయ్ చేసుకొవాలి.లేదంటే కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 
  • చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించాలి.
  • ఇప్పుడు స్టవ్ఆఫ్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోండి. 
  • ఇప్పుడు మనం ముందుగానే ఫ్రయ్ చేసి పక్కనపెట్టుకున్న ఫ్రైడ్ కరివేపాకు మరియు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటె  వేడివేడి టేస్టి టేస్టి  చికెన్ 65 రెడీ…..

ఆరోగ్య ప్రయోజనాలు

  • కండర పుష్టి పొందడానికి ఉడికించిన చికెన్ ను తమ ఆహారంలో చేర్చుకోవాలి.
  • చికెన్ లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.
  • చికెన్ తింటే జీర్ణక్రియను పెంచి ఆకలిని పెంచుతుంది.
  • చికెన్ లో ఉండే క్యాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • చికెన్ లో చాలా రకాల పోషకాంశాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది
  • పెరిగే పిల్లలకు చికెన్ బూస్ట్ వంటింది. చికెన్ లో అధికమైన అమినోఆసిడ్స్ పిల్లలు పొడవుగా మరియు శక్తివంతంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.
  • జలుబు చేసినప్పుడు చికెన్ లో పెప్పర్ వేసుకొని తింటే జలుబు నుండి ఉపశమనం దొరుకుతుంది.
  • బరువు అదుపులో ఉంచడానికి కూడా ఈ చికెన్ చాలా మంచిది. 
  • అలానే ఒత్తిడి ఇంకా కీళ్ళనొప్పులు తగ్గడానికీ కూడా బావుంటుంది. 

Best To Have With Chicken65

New Recipes

The best food lovers across globe speak about their favourite and delicious recipes here, you can consider exploring them and give a try and surprise your family.

Explore Recipes
Refined Oil Alternatives – Replace this with Cold Pressed Oils

Our country India is primarily known for its food and varied culture. Spice and oils [...]

Refined Oil Side Effects and Diseases due to Consumption of it

When you are thinking about switching to eating healthy, the first thing to change is [...]

What are Cold Pressed Oils and How are they made

Cold pressing is a mechanical procedure in which the manufacturers’ extracts and separate the oil [...]

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.