కావలసిన పదార్ధాలు

(ఇద్దరి కోసం చేస్తున్న బిర్యానికి ఈ పదార్థాలు)

బిర్యానీ మసాలా కొసం

  • ఒక అంగుళం దాల్చిన చెక్క2 ముక్కలు
  • 4 – 6 లవంగాలు
  • 3 – 4 యాలుకలు
  • 1 టేబుల్ స్పూన్  షాజీరా
  • 1/4 ముక్క జాజికాయ
  • 1 అనాస పువ్వు
  • 3 గ్రాముల బిర్యానీ కా ఫూల్
  • 2 మరాఠీ మొగ్గు చిన్నవి
  • 1 ముక్క జాపత్రి
  • 500 గ్రాముల బాస్మతి బియ్యం
  • నీళ్ళు

మారినేషన్ కొరకు

  • 500 గ్రాములు చికెన్ , 
  • 1/2 టేబుల్ స్పూన్  పసుపు పొడి
  • ఉప్పు రుచికి సరిపడా
  • 2 టేబుల్ స్పూన్లు కారం
  • 1 టేబుల్ స్పూన్  పచ్చిమిర్చి ముద్ద
  • 1 టెబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • పుదీనా ఆకులు గుప్పెడు
  • 3 మీడియం ఉల్లిపాయలు ,
  •  చాలా సన్నగా నిలువుగా తరిగిన ముక్కలు
  • 200 గ్రాముల గట్టిపెరుగు
  • 1 నిమ్మకాయ
  • 6 టేబుల్ స్పూన్లు  నూనె , కాచినది
  •  3 టేబుల్ స్పూన్లు  నెయ్యి

తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని 2నుండి3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒకారగంట నాననివ్వండి

  • ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి.
  • డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టుకుని, ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి లేత గోధుమరంగులోకి మారేవరకు వేయించాలి.
  • బయటకు తీసేటప్పుడు గరిటెతో నూనె ను గట్టిగా వత్తేసి పక్కన పెట్టుకోవాలి.అలా చేస్తే వేయించిన ఉల్లిపాయలు కర కర లాడతాయి.
  • మరాఠీ మొగ్గలు, జాపత్రి, అనాస పువ్వు ,దాల్చినచెక్క, లవంగాలు, యాలుకలు, షాజీరా, జాజికాయ, అనాసపువ్వు, బిర్యానీ ఆకు,అన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • 500 గ్రాముల చికెన్ కొరకు 1  నుండి 2 టేబుల్ స్పూన్లుల మనం ప్రిపేర్ చేసిపెట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుంది.
  • బిర్యానికి ముందుగానే అన్నాన్ని అన్ని మసాల దినుసులనువేసి 80% ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
  • అందుకోసం ఒక మందపాటి గిన్నెలో నీళ్ళు పోసి, అందులో తగినంత ఉప్పు, అన్ని మసాలా దినుసులు, కొద్దిగా పుదీనా ఆకులు, బిర్యానీ ఆకు వేసి మరిగించాలి.
  • నీళ్ళు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.అప్పుడు మళ్ళీ మరిగించాలి.
  • మళ్ళీ మరగడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వంచేయాలి .
  • అలానే బిర్యాని చేసుకోవడానికి ముందుగానే కొన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి.
  •  అందుకోసం చికెన్కు కొన్ని మసాలాలు పట్టించి మారినెశన్ చేసుకోవాలి.
  • శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, 2 tsp బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మ రసం, పెరుగు, పచ్చిమిర్చి పుదీనాఆకులుపేస్ట్, వేసిబాగా ముక్కలకు పట్టేలా కలపాలి.
  • చికెన్ ముక్కలను ఈమసాలాల్లొ కనీసం 1 నుండి 2 గంటల పాటు నాననివ్వాలి.
  • అలా అయితే చికెన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టి ఫ్లెవర్ బాగా వస్తుంది.
  • ఇవన్ని ప్రిపరేషన్ అయినా తరువాత ఇప్పుడు బిర్యాని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. 
  • బిర్యానీ పాత్ర అంచులకు నూనె రాసి, 4నుండి 5 టేబుల్ స్పూన్లుల కాచిన నూనె, 2 టేబుల్ స్పూన్లుల నెయ్యి వేయాలి.
  • అందులో నానబెట్టిన చికెన్ కొంచెం వేసి సమానంగా స్ప్రెడ్చెసి కొద్దిగా హిట్అయ్యాక  పైన సగం ఉడికించిన అన్నం వేయాలి.
  • ఇప్పుడు అన్నం పైన కొన్ని పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
  • ఇప్పుడు మరి అలాగే అన్నం మీద మిగిలిన చికెన్వేసుకుని దానిమీద అన్నాన్ని , అన్నంపైన పుదీనా ఆకులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
  •  ఇప్పుడు అల్ల్యుమినియం ఫాయిల్థొగాని తడిబట్టతోగాని బిర్యానీ పాత్రని సరిగ్గా గాలిపోకుండా కవర్ చేసుకోవాలి.
  • అలానే పైన మూత పెట్టి, ఏదైనా బరువు పెట్టాలి.
  • 10 నుండి 15 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించి 5 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించాలి.
  • స్టవ్ కట్టేసి కాసేపు మూత తెరవకుండా వదిలేసి తర్వాత మూతతీయాలి.
  • ఇప్పుడు చాలా జాగ్రత్తగా బిర్యానిని కదపాలి.
  • లేకుంటే అన్నం విరిగిపొయే అవకాశం ఉంటుంది. 
  • ముక్కలు అన్నాన్ని Mix చేసుకున్నకా వేడివేడి చికెన్ బిర్యాని సెర్వ్ చేసుకోవడానికి రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు

  • కండర పుష్టి పొందడానికి ఉడికించిన చికెన్ ను తమ ఆహారంలో చేర్చుకోవాలి.
  • చికెన్ లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.
  • చికెన్ తింటే జీర్ణక్రియను పెంచి ఆకలిని పెంచుతుంది.
  • చికెన్ లో ఉండే క్యాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • చికెన్ లో చాలా రకాల పోషకాంశాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది
  • పెరిగే పిల్లలకు చికెన్ బూస్ట్ వంటింది. చికెన్ లో అధికమైన అమినోఆసిడ్స్ పిల్లలు పొడవుగా మరియు శక్తివంతంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.
  • జలుబు చేసినప్పుడు చికెన్ లో పెప్పర్ వేసుకొని తింటే జలుబు నుండి ఉపశమనం దొరుకుతుంది.
  • బరువు అదుపులో ఉంచడానికి కూడా ఈ చికెన్ చాలా మంచిది. 
  • అలానే ఒత్తిడి ఇంకా కీళ్ళనొప్పులు తగ్గడానికీ కూడా బావుంటుంది. 

 

 

Best To Have With Chicken Biryani

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.