కావలసిన పదార్ధాలు

పచ్చిమామిడికాయలు-12అంటే ఒక డజను

ఆవాలు-3/4సెరు(వీటిని పచ్చివె పొడి చేసుకోవాలి)

మెంతులు-3/4సెరు

వెల్లుల్లి-1/4కేజీ

ఆయిల్-750గ్రాములు

కారం-3/4సెరు

ఉప్పు-3/4సెరు 

పసుపు-1 స్పూన్

తయారీ విధానం

  • ముందుగా మామిడికాయలను నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక గుడ్డతో నీళ్లు లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి.
  • అలానే తుడిచిన వాటిని ఒక 5 నిముషాలు ఆరనివ్వాలి.
  • ఇప్పుడు ఆరిన మామిడికాయలను పైన తొటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి.
  • తొటాలు కట్చేసుకున్న మామిడికాయలను ఇప్పుడు ఒక మామిడికాయలో 2 ముక్కలుగా కట్చేసుకున్న చేసుకోవాలి.
  • రెండుగా ముక్కలను ఇప్పుడు మధ్యలో టెంకకు ఉన్న జీడిని కత్తితో తీసుకొని అలానే జీడి వెనుక ఉన్న పొరను కూడా తీసుకోవాలి.
  • ఇప్పుడు అలా చేసుకున్న కాయలను అంటే మనం ఒక కాయను 2 బాగాలుగా చేసుకున్నాం. ఇప్పుడు చేసుకున్న ఒక్కో భాగం నుండి 6 ముక్కలు చేసుకోవాలి.
  • అంటే ఒక కాయకు 12 ముక్కలు అవుతాయి.
  • ఇలా డజను కాయల్ని కట్ చేసుకుంటే మనకు 3 సెర్లు మామిడి ముక్కలు అవుతాయి.
  • ఇప్పుడు 750 గ్రాముల ఆయిల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
  • ఇలా కట్చేసుకున్న 3 సేర్ల ముక్కలను నూనె పోసుకున్న గిన్నెలో ముంచి ఇంకొక పాత్రలో వేసుకోవాలి.
  • ఇప్పుడు వేసుకునే పాత్ర వెడెల్పుగా కొంచెం పెద్దగా ఉంటే కలుపుకవడానికి అనువుగా ఉంటుంది.
  • అలానే ముక్కలను కూడా సరిగ్గా కొలుచుకొని పెట్టుకోవాలి. 
  • ఇక్కడ ఒక సెరుకుగాను అన్ని ఉప్పు,కారం,ఆవపొడి,అన్ని అరపావు చెప్పున పడతాయి.
  • వెలుల్లి ఒక సెరుకు గాను 90గ్రాములు.
  • మెంతిపొడి 100 గ్రాములు ఆయిల్ ఒక సెరుకు 125 గ్రాములు పడుతుంది.కావాలంటే ఆయిల్ ఇంకొంచెం వేసుకోవచ్చు ఇష్టపడేవారు. 
  • ఇప్పుడు వెడెల్పు గిన్నెలో వేసుకున్న ముక్కల్లో ఉప్పు, కారం,ఆవపిండి,అలానే ముక్కలను ముంచగా మిగిలిన ఆయిల్ అంతా కూడా పొసుకొవాలి.
  • అలానే ఒక స్పూన్ పసుపుపొడి కూడా వేసుకోవాలి.
  • ఇప్పుడు వీటన్నిటి బాగా కలుపుకోవాలి. 
  • కలిపి ఇప్పుడు ఒక క్లాత్ను మనం కలుపున గిన్నెకు కట్టి మరుసటిరోజు వరకు అలానే ఉంచాలి.
  • మరుసటిరోజు ఆ క్లాత్  తీసి ఒకసారి కలుపుకొవాలి.ఇలా 3 రోజులు చేసుకోవాలి.అలానే క్లాత్ కట్టుకొవాలి.
  • ఇప్పుడు నాలుగో రోజు తీసి బాగా కలిపి అందులో కొంచెం మెంతిపొడి వెల్లుల్లి వేసుకోవాలి.
  • వెల్లుల్లిని కొన్ని నలగొట్టుకుని కొన్ని అలానే వేసుకోవాలి.
  •  వేసుకున్నాక అంతా బాగా కలుపుకోవాలి.
  • కలుపుకున్నాక మల్లి ఒక క్లాత్  కట్టుకొని ఇంకో రెండు రోజులు అలానే ఉంచాలి.
  • అంటే రోజు కలుపుకొని మల్లి అలానే క్లాత్  కట్టుకోవాలి.
  • ఇదంతా అయ్యేటప్పటికి ఉప్పు కారం అన్ని కూడా ముక్కలకు బాగా పట్టి ముక్కలు కూడా బాగా మగ్గుతాయి.
  • ఇలా మగ్గిన ఆవకాయను ఒక  జాడిలో స్టోరేజ్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండె ఆవకాయ రెడీ. 
  • ఈ పిక్కల్ చేసిన తరువాత ఒక నెలవరకూ తీసుకోవచ్చు

ఆరోగ్య ప్రయోజనాలు

  • ఇందులో ఎక్కువ ఆయిల్ అలానే నిల్వ పచ్చడి కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకుంటే మంచిది.
  • ఇదే కాదు ఏ నిల్వ పచ్చడి  కూడా సాధ్యమైనంత తక్కువ తీసుకుంటే మంచిది.

New Recipes

The best food lovers across globe speak about their favourite and delicious recipes here, you can consider exploring them and give a try and surprise your family.

Explore Recipes

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.