రాయలసీమ మటన్ మసాలా
పేరులొనే ఉంది రాయలసీమ మటన్ మసాలా. చాలా చాలా పాపులర్ ఈ. కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాలలో చాలా ఫేమస్. రాయలసీమ ప్రజలు ఎక్కువగా మసాల, కారం తినడానికి ఇష్టపడతారు. అందులోనూ మాంసాహారం
అంటే ఇంకా ఇష్టపడతారు. ఇందులో వాడే మసాలా పేస్ట్ ఈ రెసిపీ కి మరింత రుచిని అందిస్తుంది.
ఎక్కువగా పల్లెటూరిలో వుండే వాళ్ళు అల్లంవెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి, గసగసాలు కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఈ పేస్ట్ ఎక్కువగా వాడుతుంటారు నాన్‌వెజ్‌లో. ఇందులో వాడే మసాల నే ముఖ్యమైనది.
దీనిని మేకమాంసం కూర అని కూడా అంటారు. రాగి సంకటి,జొన్నరొట్టె దీనికి పర్ఫెక్ట్ అండ్ సూపర్ కాంబినేషన్. జొన్నరొట్టె తో తింటూ ఉంటే ఆహా అదిరిపోతుంది. ఇంకేం కావాలి అంతకంటే! ఇంట్లో తయారు చేసుకున్న మసాలతో చేసుకుంటే ఆ రుచే వేరు. మసాలా పేస్ట్ ని మిక్సీ లో కాకుండా రోలు లో రుబ్బితే ఇంకేం కావాలి,అంత బాగుంటుంది.ఇంకెందుకు ఆలస్యం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
Watch A Video