మలై మటర్ పనీర్
ఇది చాలా సుప్రసిద్ధమైన అయినటువంటి వంట. శాకాహారం మాత్రమే తినే వాళ్ళకి ఇది ఒక మంచి వంట అని చెప్పవచ్చు.పనీర్ తో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఎలాగ చెసుకున్న పనీర్ తో చేసే ఏ వంట అయిన చాలా బాగుంటుంది.ఈ మలై మటర్ పనీర్ రెసిపీ అనేది పూర్తిగా గ్రేవీ మీద బేస్ అయిఉంటుంది. గ్రేవీ నుండే ఈ వంటకి మంచి రుచి వస్తుంది. అందులోనూ ఇందులో మనం మటర్ అంటే పచ్చి బఠాణీలు కూడా వేస్తాము. కాబట్టి దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
ఇది ఒకసారి ఇంట్లో ప్రయత్నించి చూడండి. తప్పకుండా అందరికి నచ్చుతుంది. పనీర్ ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా శాఖాహారులకు పన్నీరుతో చేసే వంటకాలు బాగా నచ్చుతాయి. ఎపుడైనా మీ పిల్లలకి మధ్యాహ్న భోజనంలో చేసి పెట్టండి. ఇక చూడండి రోజు అదే చేయమని అడుగుతారు. స్కూల్ కి పెట్టి ఇస్తే కుడా లంచ్ బాక్స్ ఖాళీ గా తిరిగి వస్తుంది ఇంటికి. అంత నచ్చుతుంది.
మలై మటర్ పనీర్ కర్రీ చపాతీ, పూరి, ఫుల్కా లోకి చక్కటి కాంబినేషన్. ఇంకా రైస్ లోకి కూడా అదిరిపోతుంది. ఈ కర్రీ దేనిలోకి అయిన చాలా రుచికరంగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని మొదలు పెడదామ!
Watch A Video