వంట వ్యవధి
చాలా సులువుగా చేసుకొవచ్చు ఈ పచ్చడి.మనం ముందుగానే గోంగూర కడిగి సిధ్ధంగా పెట్టుకుంటే ఒక 20 నిమిషాలు పడుతుంది.
ఖ్యాతి పొందినప్రదేశాలు:
ఆంధ్రప్రదేశ్,కేరళ,తమిళనాడు.
- ఈ గోంగూర పచ్చడి తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రసిద్దిచెందినది.
- ఇక్కడ ఈ పచ్చడికి ఆంధ్రమాత అనేపేరు కూడావున్నది.
- ఇక్కడి ప్రజలు ఈ పచ్చడిని చాలాబాగా రుచిగా చేస్తారు.
- అలానే చాలా ఇష్టంగా తింటారు.
- ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు,కేరళలో కూడా ఇష్టపడతారు.
- మొత్తం మనదేశంలో ఈ వంట సుప్రసిద్దమైనది.
ఈ వంటకి కాంబినేషన్:
- ఈ పచ్చడి లో ఒక్క నెయ్యి వేసుకొని కలిపి తింటే చాలారుచిగా ఉంటుంది.
- ఇంకా కావాలంటే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న చాలా బాగుంటుంది.
- కొంతమంది భోజనంలో ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని కలుపుకుతింటారు.
- ఇంకొంతమంది అన్నంపప్పులో నంచుకుతింటారు.
- రాత్రిభోజనంలో కూడాతింటారు.
ఉదయం అల్పాహారంలో రొట్టె,చపాతీలకు కూడా తింటారు. అన్నివేళల తినే ఆహారం ఈ గోంగూర.