కావలసిన పదార్థాలు:

  • బీరకాయలు
  • టమోటా
  • పాలు
  • అల్లం 
  • వెల్లుల్లి 
  • పసుపు
  • ఉప్పు
  • కారం
  • నూనె 
  • నీళ్లు
  • ఆవాలు 
  • జీలకర్ర 
  • కొత్తిమీర 
  • మినప్పప్పు 
  • కరివేపాకు 
  • ఎండు మిర్చి 
  • ధనియాల పొడి 
  • గరం మసాల
  • జీలకర్ర పొడి

తయారివిధానం:

  •  ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి చిన్నముక్కలుగా కట్చేసుకోవాలి. 
  • అలానే అల్లంవెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసుకొవాలి.
  • నూనె వేడి అయ్యాక కొన్ని ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఎండు మిర్చి,మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అలానే అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. 
  • ఇప్పుడు అందులో కొంచెం పసుపు,ఉప్పు కారం వేసుకొని బాగా తిప్పుకొవాలి.
  • అదంతా కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి.
  • అలానే ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని తగినన్ని నీళ్లు అలానే కొన్ని పాలు వేసుకుంటేఈ కర్రీ  చాలా బాగుంటుంది.
  • కొద్దిగా ఇవన్ని ఉడికాక ఇప్పుడు కొంచెం ధనియాల పొడి,జీలకర్ర పొడి అలానే కొద్దిగా గరం మసాలా పొడి వేసి బాగాకలుపుకోవాలి.
  • ఇప్పుడు కొంచెం సేపు స్టవ్ తక్కువ మంటలో మూతపెట్టుకొని కొంచెం సేపు ఉడికించాలి. 
  • ఇప్పుడు మూతతీసి కించెం కొత్తిమీర వేసుకొని మూతపెట్టి ఉంచాలి. 
  • అలానే స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి.
  • ఒక 5 నిముషాల తరువాత మూతతీసి వడ్డించుకుంటే వేడివేడి బీరకాయ టమోటాకర్రీ రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు

  • డైట్లో ఉన్న వాళ్లకి ఈ బీరకాయ చాలా ఉపయోగకరం. 
  • ఇందులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
  • విటమిన్ C,జింక్,ఐరన్,మెగ్నిషియమ్ ఇంకా ఎక్కువే ఉన్నాయి. 
  • ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వలన మనశరీరంలో ఉన్న కొవ్వు కూడా        తగ్గిస్థుంధి.
  • కాబట్టి ఇది బరువు తగ్గే వారికి మంచి ఆహారం ఈ బీరకాయ.

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.