కావలసిన పదార్ధాలు:

  • వంకాయలు
  • ఉప్పు
  • కారం
  • నూనె 
  • పసుపు
  • వెల్లుల్లి
  • అల్లం
  • ధనియాల పొడి 
  • కొత్తిమీర 
  • ఆవాలు
  • జీలకర్ర 
  • మినప్పప్పు 
  • కరివేపాకు
  • ఎండు మిర్చి 
  • నీళ్లు
  • గరం మసాల
  • ఉల్లిగడ్డ
  • టమోటా

 

 తయారివిధానం:

  • ముందుగా అల్లంవెల్లుల్లిని ధంచుకుని పేస్ట్ చేసుకోవాలి. 
  • అలానే వంకాయలు సన్నగా పొడుగ్గా ముక్కలు చేసి ఉప్పు నీటిలో వేసుకొని రెడీగా ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. 
  • ఇప్పుడు స్టవ్ మీద ఒకగిన్నె పెట్టి వేడి అయ్యాక అందులో కొంచెం నూనె వేసుకోవాలి.
  • నూనెవేడి అయ్యాక అందులో ఒకస్పూన్ ఆవాలు,జీలకర్ర వేయాలి. 
  • ఆవాలు,జీలకర్ర వేగాక కొంచెం కరివేపాకు అలానే కొన్ని ఎండు మిర్చి వేసుకొని వేయించుకొవాలి.
  • ఇప్పుడు కొంచెం అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి.
  • ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి.
  • అలానే అందులో పసుపు,ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
  • వంకాయ ముక్కలు ఫ్రై అయ్యాక అందులో రుచికి సరిపడా కారం వేసుకొని భాగా కలుపుకోవాలి. 
  • కారం ముక్కలకి బాగా పట్టాక అందులో ఒక టమోటాని ముక్కలు చేసుకొని వేసుకోవాలి.
  • ఇప్పుడు కూరలో సరిపడా నీళ్లు పోసుకోవాలి.
  • ఇప్పుడు ఒక 2 నిమిషాలు స్టవ్ చిన్నమంట మీద  కూరని బాగా మగ్గించాలి.
  • ఇప్పుడు మగ్గాక కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాల పొడి వేసి కలిపి మూతపెట్టాలి.
  • ఒక 5 నిముషాలు ఉడికించాలి చిన్న మంట మీద.
  • ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు మూత పెట్టాలి. 
  • 5 నిముషాల తర్వాత వేడివేడి వంకాయ కూర రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు

  • వంకాయ తినడం వలన క్యాన్సర్ కణాలు నియంత్రణలో ఉంచొచ్చు.
  • ఇందులో చాలా న్యుట్రియనస్ ఉంటాయ్.
  • రక్తంలో ఉండె షుగర్ని నియంత్రణకు ఉపయొగకరం. 
  • బరువు తగ్గడంలో కూడా సహయపడుతుంధి.
  • గుండె జుబ్బుల సమస్యలు కూడా తగ్గడానికి సహయపడుతుంధి.

New Recipes

The best food lovers across globe speak about their favourite and delicious recipes here, you can consider exploring them and give a try and surprise your family.

Explore Recipes

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.