ఆంధ్రా కోడి కూర
ఆంధ్రా కోడి కూర. ఇది ఆంధ్రా ప్రాంత ప్రజల యొక్క ఉత్తమైన మరియు ఇష్టమైన వంటకాల్లో ఒకటి. పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా! చాలా చాలా సులభమైనటువంటి రెసిపీ. ఇందులో వాడే గసగసాలు, కొబ్బరి, మిగతా మసాలా దినుసులు ఈ రెసిపీకి ముఖ్యమైన పదార్థాలు. రోట్లో రుబ్బితే రుచి చాలా బాగుంటుంది. ఈ కాలంలో మనకు రోళ్ళు అందుబాటులో ఉండటం లేదు కాబట్టి మిక్సీ లో గ్రైండ్ చేసుకుంటున్నాం.
దీనిని ఇష్టపడని వాళ్ళు ఎవరు వుండరు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఆదివారం వచ్చింది అంటే ప్రతీ ఇంట్లో ఖచ్చితంగా కోడి కూర తయారు చేసుకుంటూ ఉంటారు. జలుబు ఉన్న వాళ్ళు ఇది తింటే దెబ్బకి జలుబు మాయం అవుతుంది. అంత ఘాటుగా ఉంటుంది అంతే కమ్మదనము కూడా.
ఈ కోడి కూర ని జొన్నరొట్టె లోకి తింటే అబ్బా ఏమి రుచి ఉంటుంది. దానికి సాటి ఏమి లేదు. రాగి ముద్ద తో కూడా చాలా బాగుంటుంది. అవే కాకుండా చపాతీ, పూరీ, దోస లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్.
ఇక రైస్ ఐటమ్స్ అయితే పలావు, ప్లైన్ రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికి తోడు పెరుగు పచ్చడి ఉంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆంధ్రా స్టైల్ కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా!
Watch A Video